మాట వినకుంటే ఆర్మీని దింపుతాం : సీఎం కేసీఆర్

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దానిని నివారించాలంటే అందరూ ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌కు సహకరించాలని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే మన దగ్గర 36పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక మహమ్మారి దానిని అందరం కలిసి కట్టుగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ 195దేశాలను పట్టి పీడిస్తున్నదని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ పోలీసులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ వైరస్ బారిన పడిన విదేశీయులు తప్పించుకుని పారిపోతున్నారని తన […]

Update: 2020-03-24 09:15 GMT

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దానిని నివారించాలంటే అందరూ ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌కు సహకరించాలని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే మన దగ్గర 36పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక మహమ్మారి దానిని అందరం కలిసి కట్టుగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ 195దేశాలను పట్టి పీడిస్తున్నదని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ పోలీసులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ వైరస్ బారిన పడిన విదేశీయులు తప్పించుకుని పారిపోతున్నారని తన దృష్టికి వచ్చిందని, కావున వెంటనే వారి పాస్ పోర్టులను సీజ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, డివిజన్లలో కార్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ లసభ్యులు, గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దండంపెట్టి కోరుతున్నట్టు సీఎం వివరించారు. రాష్ట్ర్రంలోని సరిహద్దుల్లో ఇప్పటికే పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయని, ఈరోజు ఒక్కరోజు వాటికి అనుమతులిస్తాం. కానీ రేపటి నుంచి పూర్తిగా బంద్ చేస్తామన్నారు. మార్కెట్లో ఎవరైనా ధరలు పెంచి అమ్మినట్టయితే వారిపై పీడీ యాక్టులు పెడుతామని వ్యాపారులను హెచ్చరించారు. అంతేకాకుండా వారి లైసెన్సులు రద్దు చేసి, భవిష్యత్తులో రాకుండా చేస్తామన్నారు. ఇకమీదట సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎవరైనా బయటకు వెళితే పరిస్థితి సీరియస్‌గా ఉంటుందని, ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. అమెరికాలో ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించిందని గుర్తు చేశారు. మీరు కూడా ప్రభుత్వం మాట వినకపోతే ఆర్మీని దించుతాం.. కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ కూడా ఇస్తామని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. కానీ, అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దన్నారు. దుకాణాదారులు కూడా సాయంత్రం 6గంటలకు ఎట్టిపరిస్థితుల్లో మూసివేయాలని అల్టీమేటం జారీ చేశారు. కవులు, రచయితలు కరోనాను ఎదుర్కొనేలా కమిసమ్మేళనాలు జరిపి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. చివరగా పోలీసులు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిసింది. వారికి ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది కావున వారి విధులు ఎవరూ భంగం కల్గించవద్దని సీఎం డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Tgas: cm kcr, corona, meet , 24 hrs karfu, no body come out side, army, shoot at site orders

Tags:    

Similar News