గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్.. కొవిడ్ పేషెంట్లతో కాసేపు..!

దిశ, వెబ్‌డెస్క్:  ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కేసీఆర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే కరోనా చికిత్స జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తూ.. ఐసీయూలో ఉన్న కొవిడ్ పేషెంట్లను పరామర్శించారు. వారి బంధువులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి అపత్కాలంలో కరోనా రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం గాంధీలో 1500 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారు. […]

Update: 2021-05-19 01:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కేసీఆర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే కరోనా చికిత్స జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తూ.. ఐసీయూలో ఉన్న కొవిడ్ పేషెంట్లను పరామర్శించారు. వారి బంధువులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి అపత్కాలంలో కరోనా రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం గాంధీలో 1500 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారు. సీఎం పదవిలో ఉండి కూడా ఒక్కసారైన గాంధీలో ఉన్న కొవిడ్ రోగులను పట్టించుకోరా..?, గాంధీ ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలపై స్పందించరా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ సీఎం కేసీఆర్ నేరుగా హాస్పిటల్‌కు రావడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం వెంట మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. కాగా, పీపీఈ కిట్ ధరించకుండానే సీఎం కేసీఆర్, హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్‌లు కొవిడ్ పేషెంట్లను పరామర్శించడం గమనార్హం.

Tags:    

Similar News