రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీని కోసం గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చలు జరపాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని […]

Update: 2021-03-29 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీని కోసం గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చలు జరపాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

సోమవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

Tags:    

Similar News