ఫిట్‌మెంట్ ఫిక్స్.. ఉద్యోగ సంఘాలకు సీఎం క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణపై సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు. మండలి ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల సహకారంతోనే విజయం వరించినట్లుగా యూనియన్ లీడర్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సమావేశంలో చర్చించిన అంశాలను ఇప్పుడే బయటకు వెల్లండించవద్దంటూ సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘ ప్రతినిధులకు సూచించినట్టు సమాచారం. కాగా, ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ నేతలకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణపై సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు. మండలి ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల సహకారంతోనే విజయం వరించినట్లుగా యూనియన్ లీడర్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సమావేశంలో చర్చించిన అంశాలను ఇప్పుడే బయటకు వెల్లండించవద్దంటూ సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘ ప్రతినిధులకు సూచించినట్టు సమాచారం.
కాగా, ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ నేతలకు సీఎం కేసీఆర్స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ కంటే కొంత మెరుగ్గానే ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 29 శాతం కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం 33 నుంచి 34 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎంను కోరారు. కేసీఆర్ దీనిపై సానుకూలంగానే స్పందించినట్లు చెప్పుతున్నారు. ఈ లెక్కన 29 నుంచి 33 వరకు ఫిట్‌మెంట్ వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.
ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తామని, ఎలాంటి ప్రకటన చేయవద్దంటూ ఉద్యోగ నేతలకు సీఎం చెప్పడంతో సమాధానం దాట వేస్తున్నారు. అదే విధంగా పదవీ విరమణ పెంపును కూడా ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ఉద్యోగులకు కనీస వేతనం, సీపీఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ సదుపాయం వంటి అంశాలన్నీ సీఎం రేపు అసెంబ్లీలో ప్రకటించనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.