బస్సులెన్నో కూడా తెలియదా? పువ్వాడపై సీఎం ఆగ్రహం

దిశ, తెలంగాణ బ్యూరో : రవాణా శాఖ మంత్రిగా బస్సులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదా? అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్లమెంటరీ, శాసనసభ పక్షాల సంయుక్త భేటీ నిర్వహించారు. వరంగల్‌లో వచ్చే నెలా 15న నిర్వహించే విజయగర్జన సభపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 22వేల బస్సుల్లో ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో […]

Update: 2021-10-17 09:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రవాణా శాఖ మంత్రిగా బస్సులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదా? అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్లమెంటరీ, శాసనసభ పక్షాల సంయుక్త భేటీ నిర్వహించారు. వరంగల్‌లో వచ్చే నెలా 15న నిర్వహించే విజయగర్జన సభపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 22వేల బస్సుల్లో ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ క్రమంలో బస్సులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని రన్నింగ్‌లో ఉన్నాయో వివరాలు చెప్పాలని పువ్వాడను కోరగా సమాధానం చెప్పలేదు. దీంతో కేసీఆర్ అసహనంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక పువ్వాడ.. సమావేశం నుంచి బయటకు వచ్చి అధికారులకు ఫోన్ చేసి బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ వెళ్లి సమాధానం చెప్పగా సీఎం అంతగా రిసీవ్ చేసుకోన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా సమావేశం అనంతరం ఓ మీడియా ప్రతినిధి పువ్వాడను ఆర్టీసీ సమాచారం చెప్పడం లేదని, వివరాలు చెప్పాలని కోరగా.. నేను ఆర్టీసీ మంత్రి కాను… ట్రాన్స్ ఫోర్టు మినిస్టర్‌ను… ఆర్టీసీ చైర్మన్‌ను అడగాలని సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా విస్తుపోయారు.

Tags:    

Similar News