కేసీఆర్ బర్త్ డే.. టాలీవుడ్ బిగ్ హీరోస్ స్పెషల్ గిఫ్ట్

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని కోటి మొక్కలు నాటే ఏర్పాట్లు రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుదాం ముఖ్యమంత్రికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం అని పిలుపునిచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు […]

Update: 2021-02-15 11:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని కోటి మొక్కలు నాటే ఏర్పాట్లు రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుదాం ముఖ్యమంత్రికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం అని పిలుపునిచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందించారు. ఇంతటి మహత్తర కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు అభినందిస్తున్నారు.

తాజాగా దీనిపై.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలన్న కేసీఆర్ గారి ఆకాంక్ష, కోరిక, దాని కోసం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుదాం.. మన ముఖ్యమంత్రికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం.. వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం..’’ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతేగాకుండా.. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున సైతం స్పందిస్తూ.. ‘గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ మధ్యనే మనం చూశాం. ఉత్తరాఖండ్‌లో జరిగిన వరదల వల్ల చాలామంది ప్రజలు చనిపోయారు. కాబట్టి బాధ్యత గల పౌరులుగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మనం కూడా ఏదైనా ఒకటి చేయాలి. అది కూడా ఒక ప్రత్యేకమైన రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ చాలా చక్కటి కార్యక్రమం చేపట్టారు. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కలు నాటి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన తరపున హరిత కానుకగా ఇద్దాం’ అని తెలిపారు.

Tags:    

Similar News