ఆంధ్రాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు.. భారీగా ఫ్లెక్సీలు

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ బర్త్ డేను టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా చేశారు. కోటి వృక్షార్చణతోపాటు రక్తదానం, అన్నదానాలు చేశారు. తెలంగాణలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం సాధారణ విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు చేయడం అసాధారణ విషయమే. విశాఖ పట్నంలోని అచ్యుతాపురంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆంధ్రా అభిమానులు వైభవంగా నిర్వహించారు. ఆలం చందు అనే యువకుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలను […]

Update: 2021-02-17 06:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ బర్త్ డేను టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా చేశారు. కోటి వృక్షార్చణతోపాటు రక్తదానం, అన్నదానాలు చేశారు. తెలంగాణలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం సాధారణ విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు చేయడం అసాధారణ విషయమే.

విశాఖ పట్నంలోని అచ్యుతాపురంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆంధ్రా అభిమానులు వైభవంగా నిర్వహించారు. ఆలం చందు అనే యువకుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఫ్లెక్సీపై కేసీఆర్‌పాటు కేటీఆర్, కవిత ఫొటోలను ముద్రించారు. కాగా ఆయన బర్త్ డే సందర్భంగా చందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే బుధవారం విశాఖలో ఆంధ్ర సీఎం జగన్ పర్యటన ఉన్న ప్రాంతంలోనే కేసీఆర్ ఫ్లెక్సీలు, సేవాలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News