వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్..
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడపలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పులపత్తూరు గ్రామానికి చేరుకున్న జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పులపత్తూరులోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులతో మాట్లాడారు. సహాయక శిబిరాల్లో వరద బాధితులను పరామర్శించారు. అలాగే రాజంపేటలో వరద ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకించారు. అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు. ఇకపోతే వైఎస్ఆర్ కడప జిల్లా […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడపలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పులపత్తూరు గ్రామానికి చేరుకున్న జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పులపత్తూరులోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులతో మాట్లాడారు. సహాయక శిబిరాల్లో వరద బాధితులను పరామర్శించారు. అలాగే రాజంపేటలో వరద ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకించారు. అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు.
ఇకపోతే వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, దాసరి సుధ, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీలు గోవింద రెడ్డి, రమేష్ యాదవ్, సి.రామచంద్రయ్య సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా రాజంపేటకు బయలుదేరారు.