మా కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు: రమ్య తల్లి

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య తల్లి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. రమ్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. రమ్య హత్య జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారన్నారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని జ్యోతి తెలిపారు. అలాగే మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని అకౌంట్లో జమ చేశారని వెల్లడించారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి […]

Update: 2021-08-18 09:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య తల్లి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. రమ్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. రమ్య హత్య జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారన్నారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని జ్యోతి తెలిపారు. అలాగే మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని అకౌంట్లో జమ చేశారని వెల్లడించారు.

తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. అలాగే తన ఆర్థిక సాయంతో పాటు పెద్ద కూతురు మౌనికకు జాబ్, ప్లాట్, పొలం ఇస్తామని హమీ ఇచ్చారని రమ్య తల్లి జ్యోతి తెలిపారు. అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి తమ కుటుంబానికి న్యాయం చేశారన్నారు. తమకు తమ చెల్లి దూరమైందని.. తాము ఉన్నామంటూ జగన్ అండగా నిలిచారని, ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు రమ్య సోదరి మౌనిక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News