పెద్ద చదువులు చదివేందుకు.. పెద్ద స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డుకాకూడదు: జగన్
దిశ, ఏపీ బ్యూరో: పెద్ద చదువులు చదివేందుకు పేదరికం అడ్డుకాకూడదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విద్యాదీవెన నిధులను తల్లుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి […]
దిశ, ఏపీ బ్యూరో: పెద్ద చదువులు చదివేందుకు పేదరికం అడ్డుకాకూడదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విద్యాదీవెన నిధులను తల్లుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అలాగే ‘మన లక్ష్యం 100 శాతం అక్షరాస్యత మాత్రమే కాదు, 100 శాతం పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా ఈఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.686 కోట్లు విడుదల చేశాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.