విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు !

దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్​ కాలంలో వృథా అయిన కాలాన్ని కవర్​ చేసేందుకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. చదువనేది ఆనందంగా సాగాలి. విద్యార్థులను వికసింపజేయాలే గానీ సతమతమయ్యేట్లు చేయకూడదని సీఎం జగన్​ వ్యాఖ్యానించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పాఠశాలల ప్రారంభం, ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం, యూజీసీ మార్గదర్శకాలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. ప్రైవేటు […]

Update: 2020-11-02 10:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్​ కాలంలో వృథా అయిన కాలాన్ని కవర్​ చేసేందుకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. చదువనేది ఆనందంగా సాగాలి. విద్యార్థులను వికసింపజేయాలే గానీ సతమతమయ్యేట్లు చేయకూడదని సీఎం జగన్​ వ్యాఖ్యానించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పాఠశాలల ప్రారంభం, ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం, యూజీసీ మార్గదర్శకాలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. ప్రైవేటు విశ్వ విద్యాలయాల్లో ప్రమాణాలను పరిశీలించాలని కోరారు. కన్వీనర్​ కోటాలో 50శాతం సీట్లు కేటాయిస్తే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంటు ప్రవేశాలు కల్పించడానికి వీలుపడుతుందన్నారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్​లో కొత్త కోర్సులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, విశాఖలోని ఐఐఎం, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, అనంతపురం సెంట్రల్‌ వర్శిటీకి సంబంధించి జరుగుతున్న పనుల గురించి అధికారులు సీఎంకు వివరించారు.

Tags:    

Similar News