‘ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్’
దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తప్పవని సీఎం జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లి కార్యాలయంలో అవినీతిని అరికట్టడం పై అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ తరహాలో అవినీతి నిరోధంపై అసెంబ్లీలో బిల్లు తెస్తామని ఆయన తెలిపారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ.. ఏసీబీకి చెందిన 14400 నెంబర్‌కు బదలాయింపు చేస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం […]
దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తప్పవని సీఎం జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లి కార్యాలయంలో అవినీతిని అరికట్టడం పై అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ తరహాలో అవినీతి నిరోధంపై అసెంబ్లీలో బిల్లు తెస్తామని ఆయన తెలిపారు.
1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ.. ఏసీబీకి చెందిన 14400 నెంబర్‌కు బదలాయింపు చేస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం కానున్నాయని తెలిపారు. తహసీల్దార్, ఎండీవో, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ చేస్తామన్నారు. టెండర్ విలువ రూ. కోటి దాటితే రివర్స్ టెండర్‌కు వెళ్లాల్సిందే అంటూ జగన్ స్పష్టం చేశారు.