సీఎంఆర్ఎఫ్ ఘటనపై ఏసీబీ విచారణకు ఆదేశం

దిశవెబ్ డెస్క్: సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కులపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కేసును ఏసీబీకి అప్పగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీకి రెవెన్యూ అధికారులు లేఖ రాశారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదు అయింది. కాగా నకిలీ చెక్కులతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.112 కోట్లను కొట్టేసేందుకు కేటుగాళ్లు ప్రయత్నించారు. చెక్కులపై బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి […]

Update: 2020-09-20 10:06 GMT

దిశవెబ్ డెస్క్: సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కులపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కేసును ఏసీబీకి అప్పగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీకి రెవెన్యూ అధికారులు లేఖ రాశారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదు అయింది.

కాగా నకిలీ చెక్కులతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.112 కోట్లను కొట్టేసేందుకు కేటుగాళ్లు ప్రయత్నించారు. చెక్కులపై బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి హోం బ్రాంచికి ఫోన్ చేయగా విషయం బయటకు వచ్చింది. . అయితే ఈ విషయంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సెక్రటరీ మురళీకృష్ణారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News