భూముల రీసర్వేకు శ్రీకారం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సర్వే రాయి పాతి భూ రీసర్వేను ప్రారంభించారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీ ఫోర్స్‌కి పచ్చజెండా ఊపి, రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ఆరంభించారు. ఈ నెల 22 నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సర్వే రాయి పాతి భూ రీసర్వేను ప్రారంభించారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీ ఫోర్స్‌కి పచ్చజెండా ఊపి, రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ఆరంభించారు.
ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని మూడు విడతల్లో 2023 జనవరి నాటికి 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.