టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోంది :జగన్

దిశ, వెబ్ డెస్క్: రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిహారంపై టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కనీస అవగహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని విమర్శించారు. కనీస అంశాలపై చర్చించకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదన్నారు. ఓ వైపు సీఎం ప్రసంగం సాగుతున్నా.. అదిప్రజలకు చేరవద్దనే కుట్రతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని […]

Update: 2020-12-01 01:33 GMT

దిశ, వెబ్ డెస్క్: రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిహారంపై టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కనీస అవగహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని విమర్శించారు. కనీస అంశాలపై చర్చించకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదన్నారు.

ఓ వైపు సీఎం ప్రసంగం సాగుతున్నా.. అదిప్రజలకు చేరవద్దనే కుట్రతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 15న రూ.1227 కోట్ల బీమా చెల్లిస్తున్నాం.. అదే రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. డబ్బు ఇస్తున్నామని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News