‘కరోనా’పై సీఎం జగన్ సమీక్ష…

దిశ, తాడేపల్లి   రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నిరోధాని తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. వైరస్ పట్ల ప్రజలను ఆందోళనకు […]

Update: 2020-03-06 09:46 GMT

దిశ, తాడేపల్లి
రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నిరోధాని తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. వైరస్ పట్ల ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దన్నారు. తగిన జాగ్రత్తలు సూచించడంతోపాటు.. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ సోకితే ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని ఆదేశించారు. అనంతపురం, విజయవాడల్లో ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ. 60 కోట్లు , ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ. 200 కోట్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

tags;ap cm jagan,corona virus review meeting, kadapa

Tags:    

Similar News