అలాంటి కామెంట్స్ రావద్దు…..

దిశ, వెబ్ డెస్క్: రైతులకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆగ్రీ ఇన్ ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్ , ఈ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్స్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయనే కామెంట్స్ రావొద్దని ఆయన అన్నారు. ఆ మేరకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సీఎం యాప్ పనితీరును […]

Update: 2020-10-28 03:46 GMT

దిశ, వెబ్ డెస్క్: రైతులకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆగ్రీ ఇన్ ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్ , ఈ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్స్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయనే కామెంట్స్ రావొద్దని ఆయన అన్నారు. ఆ మేరకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సీఎం యాప్ పనితీరును ఆయన సమీక్షించారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని అలెర్టు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 10,641 ఆర్బీకేల ద్వారా పంటలకు కనీస మద్దతు ధరలు ఉన్నాయా లేదా అన్న సమాచారం రోజూ రావాలని ఆయన అన్నారు. ఆ నివేదికలు ,అలెర్ట్స్ ను ప్రతిరోజూ పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Tags:    

Similar News