నర్సాపురం ప్రేమోన్మాది ఘటనపై సీఎం జగన్ ఆరా..

దిశ, వెబ్‌డెస్క్ : మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలు అనూషను, విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సాపురంలో వెలుగులోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ హత్య ఉదంతంపై స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి […]

Update: 2021-02-24 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలు అనూషను, విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సాపురంలో వెలుగులోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ హత్య ఉదంతంపై స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. అంతకుముందు అనూష మృతి పట్ల సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

Tags:    

Similar News