కేసీఆర్, జగన్ భేటికి ముహూర్తం ఫిక్స్..

దిశ, ఏపీ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ మీడియా ముఖంగానే ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ అధికారులతో తానే స్వయంగా మాట్లాడుతునని తెలిపిన కేసీఆర్ ఆ ప్రక్రియ జరగకముందే తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటి అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌, కేసీఆర్‌తో కేంద్ర జలవనరుల శాఖామంత్రి […]

Update: 2020-08-19 08:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ మీడియా ముఖంగానే ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ అధికారులతో తానే స్వయంగా మాట్లాడుతునని తెలిపిన కేసీఆర్ ఆ ప్రక్రియ జరగకముందే తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటి అయ్యేందుకు రంగం సిద్ధమైంది.

ఈ నెల 25న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌, కేసీఆర్‌తో కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో భేటి కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర జలసంఘం ఛైర్మన్, కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు సమాచారం అందించింది.

కాగా, ఈ సమావేశం ముఖాముఖి జరగడంలేదు. 25వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలవివాదంపై సమావేశం జరగనుంది. ఈ భేటీలో కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు తలపెట్టిన ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుల వివరాలపై పకడ్బందీగా తమ వాదనలు వినిపించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News