వైద్య సిబ్బందికి సీఎం గిఫ్ట్.. ఉత్తర్వులు జారీ
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తున్న రాష్ట్ర వైద్య శాఖ సిబ్బందికి గ్రాస్ సాలరీలో 10 శాతం అదనంగా సీఎం గిఫ్ట్‌గా చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95,392 మంది మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సీఎం ప్రోత్సాహకం కింద రూ. 5 వేలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్మికులకు ప్ర్యతేకంగా […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తున్న రాష్ట్ర వైద్య శాఖ సిబ్బందికి గ్రాస్ సాలరీలో 10 శాతం అదనంగా సీఎం గిఫ్ట్‌గా చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95,392 మంది మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సీఎం ప్రోత్సాహకం కింద రూ. 5 వేలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్మికులకు ప్ర్యతేకంగా రూ. 7,500 ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: corona, telangana, medical and health staff, municipal staff, special incentives