వీళ్లు చెప్పినా వినడం లేదు.. మీరు జోక్యం చేసుకోండి: భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నా పట్టించుకునే వారు లేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కరోనా ఉద్ధృతిపై సీఎస్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నా పట్టించుకునే వారు లేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కరోనా ఉద్ధృతిపై సీఎస్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ వల్ల ప్రయోజనం లేదని సీఎస్ అన్నారని, హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారన్నారు. కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని భట్టి అన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తర్వాత నుంచి వ్యాక్సినేషన్ పూర్తిగా ఆగిపోయిందని ఆక్షేపించారు. ఐసోలేషన్ కేంద్రాలు పెంచి పాలనను వికేంద్రీకరణ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్ర పరిపాలనపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు భట్టి తెలిపారు.