ఉద్యోగ సంఘాలు ఎవరి కోసం పని చేస్తున్నాయి : భట్టి

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎన్జీవో, టీజీవో నేతలపై సీఎల్పీ భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్​ పదేపదే మాట తప్పుతున్నా ఎందుకు నమ్ముతున్నారని, 2018లో కూడా పీఆర్సీ వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం మూడు మాసాల్లో రావాల్సిన పీఆర్సీ కమిటీ రిపోర్ట్ 33 మాసాలైన ఇవ్వలేదని, ఇప్పుడు సీఎం పిలవగానే ఉద్యోగ సంఘాలు పరుగులు పెడుతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల కోసం పని చేస్తున్నాయా? […]

Update: 2020-12-31 11:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎన్జీవో, టీజీవో నేతలపై సీఎల్పీ భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్​ పదేపదే మాట తప్పుతున్నా ఎందుకు నమ్ముతున్నారని, 2018లో కూడా పీఆర్సీ వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం మూడు మాసాల్లో రావాల్సిన పీఆర్సీ కమిటీ రిపోర్ట్ 33 మాసాలైన ఇవ్వలేదని, ఇప్పుడు సీఎం పిలవగానే ఉద్యోగ సంఘాలు పరుగులు పెడుతున్నాయని మండిపడ్డారు.

ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల కోసం పని చేస్తున్నాయా? సీఎం‌కు భజన చేస్తున్నాయా అంటూ విమర్శించారు. టీఎన్జీవో, టీజీవో నేతలు ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నారని, ఇలాంటి సంఘాల నాయకులతో ఉద్యోగులకు న్యాయం జరుగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలను సీఎం ఎందుకు పిలవడం లేదని, చెబితే వినే వారిని పిలిచి మిగిలిన ఉద్యోగులను వేదనకు గురిచేశారని తూర్పారబట్టారు. 2020లో రాష్ట్ర ప్రజలందరినీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, ప్రభుత్వం పాలన వదిలేసి ఫామ్‌హౌజ్‌లో పడుకుందని, 2021లోనైనా ప్రభుత్వాలు ప్రజల సమస్యల‌పై స్పందిస్తాయని ఆశిస్తున్నాని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Tags:    

Similar News