అమావాస్య రోజు ఆకాశంలో అద్భుతం

దిశ, నేరేడుచర్ల: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండయ్య గూడెంలోని రామాలయానికి వెళ్తోన్న పూజారి శ్రీనివాస శాస్త్రి ఆకాశంలో శివలింగం ఆకారంలో మబ్బులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే తన ఫోన్‌లో బంధించారు. నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పూజారి అమావాస్య రోజు శివలింగం ఇలా దర్శనం ఇవ్వడాన్ని చూసి సంతోషించారు. శివలింగం ఆకాశంలో కన్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Update: 2021-10-05 23:05 GMT

Tags:    

Similar News