హాఫీజ్‌పేట్‌లో టెన్షన్… టెన్షన్

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పోలింగ్ బూత్‌ల దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. హాఫీజ్‌పేట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లెక్సీలు […]

Update: 2020-11-30 21:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పోలింగ్ బూత్‌ల దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. హాఫీజ్‌పేట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లెక్సీలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా ఆర్కేపురం పోలింగ్ బూత్‌లో టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి డబ్బులు పంచుతున్నాడని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా నందినగర్‌ డివిజన్‌లోని పోలింగ్ బూత్-8లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేగాకుండా గుడిమల్కాపూర్‌లో ఓ ఇంట్లో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Tags:    

Similar News