టీఆర్ఎస్ వర్గాల్లో ఘర్షణ.. పదిమందికి గాయాలు

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణతండాల్లో టీఆర్ఎస్ వర్గాల్లో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపు పదిమందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. వివరాళ్లోకి వెళితే.. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన శంకర్, రామారావు అనే ఇద్దరు వ్యక్తులు గ్రామ సర్పంచ్‌లుగా పోటా పోటీగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు టై(సమానంగా)గా వెలువడ్డాయి. దీంతో గ్రామ పెద్దలు, అధికారులు టాస్ […]

Update: 2020-06-22 08:19 GMT

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణతండాల్లో టీఆర్ఎస్ వర్గాల్లో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపు పదిమందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. వివరాళ్లోకి వెళితే.. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన శంకర్, రామారావు అనే ఇద్దరు వ్యక్తులు గ్రామ సర్పంచ్‌లుగా పోటా పోటీగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు టై(సమానంగా)గా వెలువడ్డాయి. దీంతో గ్రామ పెద్దలు, అధికారులు టాస్ వేసి, ఒప్పందంలో టాస్ గెలిచిన వారు సర్పంచ్‌గా, ఓడిన వారికి గెలిచిన వారు రూ.7లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ టాస్‌లో సర్పంచ్‌గా రామారావు విజయం సాధించారు. ఒప్పందం ప్రకారం.. శంకర్‌కు రామారావు రూ.5లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.2 లక్షలు ఎంత అడిగినా లెక్కచేయకపోవడంతో పెద్దలకు విషయం చెప్పాడు. ఇదిలా ఉండగా గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో ఇరు వర్గాలూ పాల్గొన్నారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి సర్దుబాటు అయ్యింది. అనంతరం సోమవారం శంకర్ కుటుంబ సభ్యులు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ సర్పంచ్ రామారావు ఇంటి వద్దకు వెళ్లి అడగడంతో ఇరువర్గాలు మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. అనంతరం ఘర్షణ చోటుచేసుకుని దాదాపు పదిమందికిపైగా గాయపడ్డారు. అనంతరం ఇరు వర్గాలూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News