కరోనా బాధితులు VS గ్రామస్తులు
దిశ ఏపీ బ్యూరో: కరోనా బాధితులు, గ్రామస్తుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం కట్టెలు, రాళ్లతో చితక్కొట్టుకున్న స్థితికి తీసుకొచ్చిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన 150 మంది వలస కూలీలు మూడు వారాల క్రితం శ్రామిక్ స్పెషల్ రైలులో వచ్చారు. వారందర్నీ క్వారంటైన్ చేసిన అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ […]
దిశ ఏపీ బ్యూరో: కరోనా బాధితులు, గ్రామస్తుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం కట్టెలు, రాళ్లతో చితక్కొట్టుకున్న స్థితికి తీసుకొచ్చిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన 150 మంది వలస కూలీలు మూడు వారాల క్రితం శ్రామిక్ స్పెషల్ రైలులో వచ్చారు. వారందర్నీ క్వారంటైన్ చేసిన అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారందర్నీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. వారంతా కోలుకుని నిన్న ఇళ్లకు పంపించారు. సుదీర్ఘ విరామం తరువాత గ్రామానికి వచ్చిన కరోనా బాధితులు ఆనందంతో కలియదిరిగారు. దీంతో వారిని కొంతమంది యువకులు అడ్డుకుని కరోనా నుంచి కోలుకోగానే ఎందుకు బయట తిరుగుతున్నారని ప్రశ్నించారు. వారు పెడసరంగా జవాబు చెప్పడంతో వాగ్వాదంగా మారింది. క్రమంగా గొడవకు దారితీసింది.
దీంతో ఇరు వర్గాలు రెచ్చిపోయి కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పదిమందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.