పువ్వాడ వర్సెస్ తుమ్మల.. సీఎం ఫోన్

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మాజీ మంత్రి తుమ్మ‌ల‌ నాగేశ్వరరావు, ప్ర‌స్తుత జిల్లా మంత్రి పువ్వాడ అజ‌య్ వ‌ర్గీయుల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా విబేధాలు భ‌గ్గుమ‌న్నాయి. పార్టీ కార్యాల‌యంలో తుమ్మ‌ల ఫొటో తొల‌గించార‌ని, దీనివెనుక మంత్రి అజ‌య్ ప్రొద్బ‌లం ఉంద‌న్న‌ది తుమ్మ‌ల వ‌ర్గీయులు ఆరోప‌ణలు చేస్తున్నారు. అజ‌య్ వ‌ర్గీయులు తుమ్మ‌ల సేవ‌ల‌ను గుర్తించ‌కుండా చేస్తున్నార‌న్న‌ది వారి వాద‌న‌. కొన్ని ఘాటైన వ్యాఖ్య‌ల‌తోనే ఆదివారం ఉద‌యం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఆ మెసేజ్ బాగా వైర‌ల్ అయింది. దీంతో […]

Update: 2020-07-26 11:38 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మాజీ మంత్రి తుమ్మ‌ల‌ నాగేశ్వరరావు, ప్ర‌స్తుత జిల్లా మంత్రి పువ్వాడ అజ‌య్ వ‌ర్గీయుల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా విబేధాలు భ‌గ్గుమ‌న్నాయి. పార్టీ కార్యాల‌యంలో తుమ్మ‌ల ఫొటో తొల‌గించార‌ని, దీనివెనుక మంత్రి అజ‌య్ ప్రొద్బ‌లం ఉంద‌న్న‌ది తుమ్మ‌ల వ‌ర్గీయులు ఆరోప‌ణలు చేస్తున్నారు. అజ‌య్ వ‌ర్గీయులు తుమ్మ‌ల సేవ‌ల‌ను గుర్తించ‌కుండా చేస్తున్నార‌న్న‌ది వారి వాద‌న‌. కొన్ని ఘాటైన వ్యాఖ్య‌ల‌తోనే ఆదివారం ఉద‌యం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఆ మెసేజ్ బాగా వైర‌ల్ అయింది. దీంతో అజ‌య్ అభిమాన సంఘం నాయ‌కులు దీనికి స్పందించారు. తుమ్మల భజన సంఘం ఖబర్దార్..! అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో తుమ్మ‌ల‌ ఫోటో తీసేయడానికి మంత్రి అజయ్ కుమార్‌కు ఏం సంబంధం ఉంటుంద‌ని మండిప‌డ్డారు. ఎంత సేపు మంత్రి మీద ఎలా బురద చల్లాలనే ఆలోచనలతో కొంత మంది తుమ్మల భజన సంఘం చేసే దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితులలో ఖమ్మం జిల్ల్లా టీఆర్ఎస్ కార్యకర్తలు గానీ, ప్ర‌జ‌లు గానీ లేరని అన్నారు. పార్టీ కార్యాలయ వ్యవహారాలలో ఎప్పుడైనా మంత్రి జోక్యం చేసుకున్నారా..? ఆధారాలు చూపకుండా నిందలు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రించారు.
ఇదిలా ఉండ‌గా తుమ్మ‌ల‌కు కేసీఆర్ నుంచి ఫోన్ రావ‌డంతో ఆయ‌న ఆదివారం హైద‌రాబాద్ బ‌య‌ల్దేరి వెళ్లారు. అదే రోజు ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్సీ సీట్ల భ‌ర్తీ స‌మ‌యంలో కేసీఆర్ నుంచి తుమ్మ‌ల‌కు పిలుపు రావ‌డంతో ఆయ‌న‌కు ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

Tags:    

Similar News