ముఖ ద్వారాల కోసం ఘర్షణ.. మేమంటే మేమే నిర్మించుకుంటామని..!

దిశ, కొందుర్గ్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొందుర్గ్ మండలంలో ముఖద్వారాల నిర్మాణం కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కొందుర్గ్ చౌరస్తా నుంచి కాలనీలోకి వెళ్లడానికి మూడు ప్రధాన ముఖ ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారాన్ని పూర్తిగా నిర్మించి దేవుని విగ్రహాలతో అలంకరించారు. ముదిరాజ్ కులస్తులు రెండవ ద్వారం నుంచి నేరుగా ఎస్సీ కాలనీకి వెళ్ళడానికి నిర్దేశించిన మార్గం దీనిని అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. మూడవది మైనారిటీ ముస్లిం కాలానికి వెళ్లే ద్వారంగా పరిగణిస్తారు. […]

Update: 2021-09-11 10:19 GMT

దిశ, కొందుర్గ్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొందుర్గ్ మండలంలో ముఖద్వారాల నిర్మాణం కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కొందుర్గ్ చౌరస్తా నుంచి కాలనీలోకి వెళ్లడానికి మూడు ప్రధాన ముఖ ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారాన్ని పూర్తిగా నిర్మించి దేవుని విగ్రహాలతో అలంకరించారు. ముదిరాజ్ కులస్తులు రెండవ ద్వారం నుంచి నేరుగా ఎస్సీ కాలనీకి వెళ్ళడానికి నిర్దేశించిన మార్గం దీనిని అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. మూడవది మైనారిటీ ముస్లిం కాలానికి వెళ్లే ద్వారంగా పరిగణిస్తారు. ఈ ద్వారాన్ని ముస్లిం నాయకులు నిర్మించుకున్నారు.

ఇప్పుడు మెయిన్ సమస్య రెండవ ముఖ ద్వారం దగ్గర మొదలైంది. అటు ముదిరాజ్ కులస్తులు మాకు చెందినది మేమే నిర్మిస్తాం అని, ఇటు ముస్లిం నాయకులు మాకు చెందినది మేము నిర్మించుకుంటామని ఘర్షణకు దిగుతున్నారు. కానీ ఈ మూడవ ద్వారం నేరుగా ఎస్సీ కాలనీకి దారి చూపిస్తుండటంతో ఇది మా పరిధిలోకి వస్తుంది. దీన్ని మేము నిర్మించుకుంటాం. ఎవరూ అడ్డు రావొద్దని ఇరువర్గాల వారు వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పి పంపించి వేశారు. ఇందులో బోయశంకర్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, కృష్ణ యాదవ్, సలీం గోరి, మొయిన్ అలీ, రఫీ, డేవిడ్ రాజ్, సామేలు, సుందర్, నరేందర్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News