‘తాలు పేరుతో ప్రతిపక్షాల రాజకీయం’

దిశ, న్యూస్ బ్యూరో : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తాలు పేరుతో రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలను వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రమాణాలున్న 3 లక్షల 84 వేల మంది రైతుల నుంచి రూ.4 వేల 187 కోట్ల విలువైన 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే యాసంగిలో ఇప్పటివరకు కొనుగోలు చేశామని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ […]

Update: 2020-05-01 11:05 GMT

దిశ, న్యూస్ బ్యూరో : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తాలు పేరుతో రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలను వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రమాణాలున్న 3 లక్షల 84 వేల మంది రైతుల నుంచి రూ.4 వేల 187 కోట్ల విలువైన 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే యాసంగిలో ఇప్పటివరకు కొనుగోలు చేశామని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ ధాన్యానికి సంబంధించి రూ.1500 కోట్లను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఓ రేషన్ షాపు దగ్గర పేదలకు బియ్యం పంపిణీ చేసే సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

రైతుల నుంచి కొన్న ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నామని, దాని ప్రకారమే రైతులకు కనీస మద్దతు ధరను ఆన్‌లైన్‌లో నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయవలసి ఉంటుందన్నారు. ఈ నిబంధన ప్రకారం కొనుగోలు చేయకపోతే ఎఫ్‌‌సీఐ అంగీకరించదన్న విషయం తెలుసుకోకుండా ప్రతిపక్షాలు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు.

Tags: Market, paddy,farmer,srinivas reddy,amount, accounts

Tags:    

Similar News