రేపు సీఐఎస్‌సీఈ 10వ, 12వ తరగతి ఫలితాలు

న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్‌సీఈ) వెల్లడించింది. కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఓ సర్క్యూలర్‌లో పేర్కొంది. ఎస్ఎంఎస్ విధానంలోనూ ఫలితాలు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. అఫిలియేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా పోర్టల్ కెరీర్ విభాగం నుంచీ ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించింది. కరోనా సంక్షోభం కారణంగా సీఐఎస్‌సీఈ […]

Update: 2021-07-23 08:40 GMT

న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్‌సీఈ) వెల్లడించింది. కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఓ సర్క్యూలర్‌లో పేర్కొంది. ఎస్ఎంఎస్ విధానంలోనూ ఫలితాలు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. అఫిలియేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా పోర్టల్ కెరీర్ విభాగం నుంచీ ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించింది. కరోనా సంక్షోభం కారణంగా సీఐఎస్‌సీఈ 10వ, 12వ తరగతి పరీక్షలు నిర్వహించలేదు. ఈ కారణంగా ఆన్సర్ స్క్రిప్ట్‌లను రీచెక్ చేసే వీలు ఉండదని స్పష్టం చేసింది. మార్కుల లెక్కింపులో తప్పులు కనిపిస్తే ఆగస్టు 1వ తేదీలోపు విద్యార్థులు అభ్యంతరాలు తెలుపవచ్చని వివరించింది.

Tags:    

Similar News