శర్వానంద్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. డైరెక్టర్ ఎవరంటే!

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్(Malavika Nair) ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

Update: 2025-01-05 09:23 GMT
శర్వానంద్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. డైరెక్టర్ ఎవరంటే!
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్(Malavika Nair) ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ మూవీతో హిట్ అందుకుని వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. హీరోయిన్‌ గానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక నిడివిని పట్టించుకోకుండా  తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.

ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో ఉత్తరగా నటించి మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలతో వరుస ప్రాజెక్ట్స్‌లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా, ఈ అమ్మడు టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) సరసన నటించబోతున్నట్లు సమాచారం. ‘శర్వా 36’ పేరుతో రాబోతున్న ఈ మూవీనికి అభిలాష్ కంకర(Abhilash Kankara) తెరకెక్కిస్తుండగా.. ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు టాక్. అయితే దీనిని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రపోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News