నువ్వు లేకుండా ఎలా ముందుకు సాగాలో నేర్పడం మర్చిపోయావు.. ప్రభాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-28 06:12 GMT

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి వావ్ అనిపించుకుంది. అయితే సడెన్‌గా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 8 సినిమాలకు పైనే ఉన్నాయి. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

రీసెంట్‌గా త్రిష పెట్ డాగ్ అయిన జోరో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జోరో చనిపోయాడు అని ఎమోషనల్ పోస్ట్ పెడుతూ కుక్క పిల్ల పిక్స్ పెట్టింది. అయితే తాజాగా మళ్లీ ఇన్‌స్టా వేదికగా జోరో సమాధి ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘నువ్వు వెళ్లి పోయావు.. కానీ నువ్వు లేకుండా నేను ముందుకు ఎలా సాగాలో నేర్పించడం మర్చిపోయావు’ అంటూ హార్ట్ బ్రేక్ సింబల్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో త్రిష మేడమ్ బాధపడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More...

Heroine: పది రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

Tags:    

Similar News