Mrunal Thakur: అవును అతన్ని మనస్పూర్తిగా ప్రేమించాను.. కానీ వదిలేశానంటూ మృణాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) వరుస చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటుంది.

Update: 2024-12-17 07:05 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) వరుస చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటుంది. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడి(Kalki 2898 AD) సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం మృణాల్, అడివి శేష్(Adivi Sesh) జంటగా ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్నారు. షనీల్ డియో(shaneil deo) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ(Supriya) యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక నిన్న అడివి శేష్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి క్యూరియాసిటీ పెంచిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు కానీ తన పక్కన హీరోయిన్‌గా నటించేది ఎవరో క్లారిటీ ఇవ్వలేదు. ఆమె ముఖాన్ని తన చేతితో కవర్ చేసి ఉన్న పోస్టర్‌ను నెట్టింట పెట్టి అందరిలో ఆసక్తిని పెంచాడు.ఇక క్యూరియాసిటీకి చెక్ పెడుతూ.. తాజాగా, మృణాల్ ఠాకూర్, అడివి శేష్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ‘డెకాయిట్’ అప్డేట్ ఇచ్చింది.

ఇందులోంచి తన లుక్ విడుదల చేస్తూ ‘‘అవును వదిలేశాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను. హ్యాపీ బర్త్ డే అడివి శేష్. లెట్స్ కిల్ ఇట్’’ అని రాసుకొచ్చింది. అయితే ఇందులో ఆమె ఒక చేతిలో స్టీరింగ్ పట్టుకుని మరో చేతిలో పిస్తోలు పట్టుకుని కనిపించింది. ఇక అదే కారులో పక్కనే అడివి శేష్(Adivi Sesh) కూర్చొని సిగరేట్ వెలిగిస్తున్నాడు. అయితే చాలా రోజుల నుంచి సస్పెన్స్‌కు మృణాల్ పోస్టుతో తెరదించింది. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News