Yellamma Movie: ‘బలగం’ ఫేమ్ డైరెక్టర్ వేణు మూవీలో హీరోయిన్‌గా సాయిపల్లవి..? వైరల్ అవుతోన్న న్యూస్

కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు(Venu) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Update: 2024-12-25 07:05 GMT

దిశ, సినిమా: కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు(Venu) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బలగం’(Balagam) సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగాడు. అసలు ఈ మూవీతో తనలో ఒక కెమెడియన్ మాత్రమే కాకుండా ఓ మంచి దర్శకుడు కూడా దాగున్నాడు అని నిరూపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి వేణు తీయబోయే నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అయితే కొన్ని రోజుల క్రితం వేణు.. తన తరువాతి సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma) అని టైటిల్‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరకక ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్.. ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది

డైరెక్టర్ వేణు.. ‘ఎల్లమ్మ’ కథ చాలామంది హీరోలకు వినిపించాడట. కానీ, చివరిగా ఈ కథకు నితిన్ (Nithin) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరో ఓకే.. మరి హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్‌కు ఇన్నాళ్లకు తెరపడింది. ‘ఎల్లమ్మ’లో నితిన్‌కు జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ అమ్మాయిగా వరుణ్ తేజ్(Varun Tej) సరసన ‘ఫిదా’(Fidaa) సినిమాలో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మరీ ఎల్లమ్మ పాత్రలో సాయి పల్లవిని చూడడానికి ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. కాగా వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు(Dil Raju) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags:    

Similar News