Allu Arjun: ఇక అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి.. ప్రభాస్ హీరోయిన్ ఫైర్ (ట్వీట్)

‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ప్రీమియర్ షోల్లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

Update: 2024-12-25 13:09 GMT

దిశ, సినిమా: ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ప్రీమియర్ షోల్లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఆమె కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు సినీ సెలబ్రిటీలు సీరియస్‌గా ఉన్నారు. ఐకాన్ స్టార్‌ను అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కానీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటంతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు.

దీంతో పోలీసులు మరోసారి ఆయనను విచారించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక ఈ ఘటనపై అల్లు అర్జున్‌(Allu Arjun)పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీ వల్లే ఒక ప్రాణం పోయిందని విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా సినీ సెలబ్రిటీలు కూడా ఉండకపోవడంతో అందరూ ఆయనను నిందితుడిగా చూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ప్రభాస్(Prabhas) హీరోయిన్ సంజన గల్రానీ(Sanjana Galrani) ఆయనకు సపోర్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేసింది. ‘‘అతనికి అండగా మేమున్నాము.

చీప్ పబ్లిసిటీ కోసం ఉన్నత స్థాయిలో ఉన్నవారిని టార్గెట్ చేయడం మానేయండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. కాగా, ఈ అమ్మడు ప్రభాస్ ‘బుజ్జిగాడు’(Bujjigadu) సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది.

Tags:    

Similar News