Vishwaksen: క్షమాపణ చెబుతున్నా.. దయచేసి మా సినిమాను చంపేయకండి

విశ్వక్‌సేన్(Vishwaksen) ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌(Laila Movie Pre Release Function)లో నటుడు పృథ్వీ(Actor Prithvi) చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Update: 2025-02-10 10:58 GMT
Vishwaksen: క్షమాపణ చెబుతున్నా.. దయచేసి మా సినిమాను చంపేయకండి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: విశ్వక్‌సేన్(Vishwaksen) ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌(Laila Movie Pre Release Function)లో నటుడు పృథ్వీ(Actor Prithvi) చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘మేకల సత్యం దగ్గర మొదట 150 మేకలు ఉన్నాయని.. ఇక గ్యాప్ ఇచ్చి లెక్కిస్తే కరెక్ట్గా 11 ఉన్నాయని’ పృథ్వీ కామెంట్స్ చేశాడు. దీంతో పృథ్వీ తమను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని.. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జరిగిన 2024 ఎన్నికల ఫలితాలను ఉద్దేశించే తరచూ పృథ్వీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా.. పృథ్వీ వ్యాఖ్యలపై హీరో విశ్వక్‌సేన్ స్పందించారు. ‘పృథ్వీ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా.. మాది సినిమా ఈవెంట్‌.. రాజకీయాలు మాట్లాడకూడదు.. దయచేసి మా సినిమాను చంపేయకండి.. నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం లేదు’’ అని విశ్వక్‌సేన్ విజ్ఙప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. 150 గొర్రెలు, 11 గొర్రెలు అంటూ పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్స్‌కి హర్ట్ అయిన వైసీపీ నేతలు బాయ్ కాట్ లైలా( #Boycott Laila) హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో భయాందోళన చెందిన విశ్వక్‌సేన్ స్పందించి క్షమాపణ చెప్పారు. సోమవార ప్రెస్‌మీట్‌లో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ‘సినిమా వాళ్లంటే ఇంత ఈజీ టార్గెట్ అవుతున్నామా? ఇంత చులకన అవుతున్నామా? సంబంధం లేని విషయంలోమమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారు’ అని ఎమోషనల్ అయ్యారు.

కాగా, లైలా చిత్రానికి రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈనెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి ముఖ్య అతిథిగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. చిరంజీవితో పాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యారు.

Tags:    

Similar News