Vishwak Sen: ‘లైలా’ నుంచి విశ్వక్ మాస్ లుక్‌ రిలీజ్.. ఎంటర్‌టైనింగ్ బ్లాస్ట్ అంటూ హైప్ పెంచుతున్న ట్వీట్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ ఏడాది ఓ మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

Update: 2024-12-16 11:53 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ ఏడాది ఓ మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. వీటిలో ఒకటి ‘లైలా’(Laila ). రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ ఎన్నడూ చూడని విధంగా లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్(Shine Screens), smt అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తనిష్క్ బాగ్చి మ్యూజింగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

ఇప్పటికే ‘లైలా’(Laila ) నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై హైప్ పెంచింది. తాజాగా, చిత్రబృందం ఈ సినిమా నుంచి డబుల్ అప్డేట్‌ను విడుదల చేశారు. ‘లైలా’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ విశ్వక్ సేన్ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలు పెంచారు. అలాగే ‘‘మాస్ కా దాస్‌లో ఎప్పుడూ చూడని అవతారాలు ఉన్నాయి. థియేటర్స్‌లో ఈ ప్రేమికుల రోజున ఎంటర్‌టైనింగ్ బ్లాస్ట్(Entertaining Blast) కాబోతుంది’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టర్‌లో విశ్వక్ సేన్(Vishwak Sen) స్టైలిష్ గాగుల్స్‌లో డ్యూయల్ ప్యాంట్‌తో ట్రెండిగా కనిపిస్తూ మాస్ లుక్‌లో ఉన్నారు. ఇక అది చూసిన వారంతా వావ్ సూపర్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News