Lavanya Tripathi: హాని చేసే వారికి మద్దతు ఇవ్వడం బాధాకరం.. షాకింగ్ వీడియో షేర్ చేస్తూ మెగా కోడలు ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి యావత్ భారతీయులను కలచివేసింది.

Update: 2025-04-29 13:29 GMT
Lavanya Tripathi: హాని చేసే వారికి మద్దతు ఇవ్వడం బాధాకరం.. షాకింగ్ వీడియో షేర్ చేస్తూ మెగా కోడలు ఇంట్రెస్టింగ్ ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి యావత్ భారతీయులను కలచివేసింది. ఇందులో అమాయకపు పర్యాటకులను దాదాపు 26 మందిని ప్యాంట్స్ విప్పించి మరీ హిందువులను కన్ఫర్మ్ చేసుకుని కాల్చేశారు. జమ్మూకాశ్మీర్ అందాలను చూడటానికి వెళ్లిన పెళ్లైన కొత్త జంటలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన భారతీయులను కన్నీరు పెట్టేలా చేసింది. ఇక ఇదంతా చేసింది పాకిస్తాన్ వారేనని అనుమానంతో సిందూ నది నుంచి వెళ్లాల్సిన నీరును కూడా భారత్ ఆపేసింది.

గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఘటనకు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఉగ్రదాడిపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. అయితే భారత్‌లో ఉన్న పాకిస్తాన్ వారిని అక్కడికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఓ వీడియోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఓ హిందూ మహిళ రోడ్‌పై వెళ్తుండగా.. అక్కడ పాకిస్తాన్ జెండాలు కనిపించడంతో వాటిని తిసేసి పడేసింది. దీంతో అక్కడున్న వారంతా ఆమెపై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా కొంతమంది పురుషులు తిడుతూ ఆమె మీదకు వెళ్లారు.

వాటిని పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిపోయిన మహిళ జెండాలను పెట్టేందుకు అంగీకరించింది. కానీ తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని కోరింది. ఇక దానికి వారు కూడా అంగీకరించారు. కానీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోపై.. లావణ్య స్పందిస్తూ.. ‘‘మన సైనికులు తమ ప్రాణాలతో దేశాన్ని రక్షిస్తుండగా, కొందరు దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూడటం బాధాకరం. దేశం లోపలి నుండి శుద్ధి చేయాల్సిన సమయం ఇది’’ అనే క్యాప్షన్ జత చేసింది.

Tags:    

Similar News