Vikrant Massey: సంచలన నిర్ణయం తీసుకున్న ‘12th ఫెయిల్’ హీరో.. షాక్‌‌లో ఫ్యాన్స్

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సె గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

Update: 2024-12-02 04:29 GMT

దిశ, సినిమా: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సె గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా ఈయన తెలుగులో ‘12th ఫెయిల్’ అనే చిత్రం‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా భారీ వసూళ్లతో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇది కాకుండా, OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నిఠారీ సంఘటన ఆధారంగా ‘సెక్టార్ 36’లో విక్రాంత్ నటన విమర్శకులను కూడా మెప్పించింది.

అలా తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విక్రాంత్ ఇప్పుడు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. విక్రాంత్ మస్సే నటనకు గుడ్ బై చెప్పారు. 2025 తర్వాత నటన నుంచి విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి విజయాలు దక్కాయని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చేందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. కాగా విక్రాంత్ నిర్ణయం అభిమానులకు షాకింగ్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Tags:    

Similar News