Vijay Devarakonda- Sukumar: అల్లు అర్జున్‌ను పరామర్శించిన విజయ్ దేవరకొండ, సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే జైలు నుంచి తన తండ్రితో కలిసి ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత భార్య, పిల్లలను కలుసుకోవడానికి తన మామ ఇంటికి వెళ్లాడు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇంటికి వచ్చిన బన్నీని పరామర్శించడానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. అక్కడ కాసేపు అల్లు అర్జున్‌తో మాట్లాడారు. కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. మళ్ళీ కాసేపటికి తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Read More : రాత్రంతా మేల్కొనే ఉన్న అల్లు అర్జున్.. జైలు అధికారులను పదే పదే ఏం అడిగారో తెలుసా?