పెళ్లి వేళ బయటపడ్డ వరుణ్ ప్రేమ వ్యవహారాలు.. లావణ్య రియాక్షన్ ఇదే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్యల వార్తలే వినిపిస్తున్నాయి.

Update: 2023-06-15 15:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్యల వార్తలే వినిపిస్తున్నాయి. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. మొన్నటి వరకు పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న లావణ్య- వరుణ్ లవ్ ఎఫైర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినా అలాంటిది ఏమీ లేదని చెప్పి అంతా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమను కొనసాగించారు. అయితే వరుణ్-లావణ్య పెళ్లి చేసుకోవడం ఒక హీరోయిన్‌కు అస్సలు ఇష్టం లేదట. ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి కన్నా. వీరిద్దరు కలిసి ‘‘తొలిప్రేమ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. పైగా లిప్ లాక్ సీన్ కూడా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ చూసి అప్పట్లో వీరు ప్రేమించుకుంటున్నారని చాలా మంది భావించారు. కానీ లావణ్యతో సడన్‌గా ఎంగేజ్‌మెంట్ అయ్యేసరికి.. రాశి కన్నా చాలా ఫీల్ అయ్యింటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లావణ్య ఈ విషయం గురించి వరుణ్‌ను అడిగితే.. ‘వరుణ్ తన ఫస్ట్ లవ్ అంటే తొలి ప్రేమ సినిమా అంతే తప్ప మా మధ్య ఏమి లేదంటే పర్వాలేదు.’ అది విన్నాక లావణ్య రియాక్షన్ ఎలా ఉంటుంది? నమ్ముతుందా మరీ? బాధపడుతుందా? అనే దానిపై ఒకొక్కరు ఒకొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Allu Aravind కంటే ముందే వరుణ్-లావణ్య ఎఫైర్ బయటపెట్టింది ఎవరో తెలుసా?  

ఉపాసన ప్రెగ్నెన్సీ ఫేక్..! ఇన్ని నెలలకు బయటపడ్డ అసలు నిజం..?  


Similar News