Upasana: ‘మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’.. మెగా కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్

రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

Update: 2024-12-16 02:26 GMT

దిశ, సినిమా: రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సనాతన ధర్మాన్ని ఉద్ధేశించి ఇన్‌స్టా వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే మాకు నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య నేర్పించారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన మేము.. అయోధ్య రామ మందిరం వద్ద అపోలో ఉచిత ఎమెర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించాం. తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో విజయవంతంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు రామ జన్మభూమిలో దీనిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.

అయితే ఈ సెంటర్లను శనివారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు ఎంత మంచి మనసు మెగా కోడలిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కామినేని ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమకు గుర్తుగా మ్యారేజ్ అయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ జంటకు క్లీంకార అనే పాప పుట్టింది. ఇక పాపకు, తన భర్తకు సంబంధించిన పలు పోస్టులు పెడుతూ ఉపాసన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

Full View

Tags:    

Similar News