అన్‌స్టాపబుల్ సీజన్-4 ట్రైలర్ విడుదల.. సూపర్ హీరోగా బాలయ్య

అన్‌స్టాపబుల్ సీజన్-4 ట్రైలర్ విడుదల అయింది...

Update: 2024-10-12 15:23 GMT

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నట సింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న షో అన్‌స్టాపబుల్(Unstoppable). ఈ షో విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 4వ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆహా(Aha)’ ఆధ్యర్యంలో నడుస్తున్న షో నాలుగో సీజన్‌(Fourth Season)పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ‘ఆహా’ సర్‌ప్రైజ్ చేసింది.

దసర సందర్భంగా ‘పండుగ సమయం వచ్చేసింది’ అంటూ అన్‌స్టాపబుల్ సీజన్-4(Unstoppable Season-4) ట్రైలర్‌ను ‘ఆహా’ విడుదల చేసింది. ఇందులో సూపర్ హీరో అవతార్‌(Superhero Avatar)లో బాలయ్య చెప్పిన డైలాగులు వావ్ అనిపిస్తున్నాయి. అక్టోబర్ 24న గ్రాండ్‌గా ఈ సీజన్ ప్రారంభంకానుంది. దీంతో సీజన్‌-4‌పై ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌కు వచ్చే ‘‘గెస్టులు ఎవరు...?. ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి. ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు.’’ అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి


Similar News