Mithun Chakraborty : నా పిల్లలకు ఛాన్స్ ఇవ్వమని.. ఏ ప్రొడ్యూసర్‌నూ అడగలేదు : మిథున్ చక్రవర్తి

దిశ, నేషనల్ బ్యూరో : సినీ రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్నా.. తానెప్పుడూ వారసత్వాన్ని ప్రోత్సహించలేదని ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత మిథున్ చక్రవర్తి అన్నారు.

Update: 2024-10-12 16:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సినీ రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్నా.. తానెప్పుడూ వారసత్వాన్ని ప్రోత్సహించలేదని ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత మిథున్ చక్రవర్తి అన్నారు. ‘‘నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు కూడా సినీ రంగంలోనే ఉన్నారు. అయితే నా పిల్లలకు సినిమా అవకాశం ఇవ్వమని ఇప్పటి దాకా ఏ ఒక్క ప్రొడ్యూసర్‌నూ అడగలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘నా కుమారుడు నమాషీ ‘బ్యాడ్ బాయ్’ సినిమా ఛాన్స్ కోసం ఆడిషన్ ఇచ్చాడు. ఇంకో కుమారుడు మిమోహ్ నిర్మాత విక్రమ్ భట్ నిర్మించిన ఓ సినిమాలో నటించాడు.

వాళ్లు నటించిన సినిమాలు నడిచాయా లేదా అనేది మరో విషయం’’ అని మిథున్ చెప్పుకొచ్చారు. ‘‘నేను నా పిల్లలకు ఒకే విషయం చెప్పాను. మీ యుద్ధంలో మీరే పోరాడాలి అనే సందేశాన్ని వాళ్లకు ఇచ్చాను’’ అని ఆయన తెలిపారు. ‘‘సినీ హీరో కావాలంటే వారసత్వం ఒక్కటే చాలదు. సహజమైన ట్యాలెంట్ కూడా కావాలి. చివరగా నెగ్గేది ట్యాలెంట్ మాత్రమే’’ అని మిథున్ పేర్కొన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.


Similar News