ఒకే ఫ్రేమ్‌లో రెండు సింహాలు.. ‘ముఫాసా ది లయన్ కింగ్’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

‘ది లయన్ కింగ్’(The Lion King) హాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

Update: 2024-12-02 08:15 GMT

దిశ, సినిమా: ‘ది లయన్ కింగ్’(The Lion King) హాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ముఫాసా ది లయన్ కింగ్’(Mufasa The Lion King) రాబోతుంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలుగు వెర్షన్‌లో ముఫాసాకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

అలాగే హిందీలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) అందించారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, చిత్రబృందం హైదరాబాద్‌(Hyderabad)లో ఓ ఈవెంట్ నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్(Namrata Shirodkar) ‘ముఫాసా ది లయన్ కింగ్’(Mufasa The Lion King) పవర్ ఫుల్ పోస్టర్’ ను లాంచ్ చేశారు. సింహం పక్కన మహేష్ బాబు కోపంగా చూస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు రెండు సింహాలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్నట్టుందని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News