Trisha: ఆ స్టార్ హీరోతో గోవాకు వెళ్లిన త్రిష.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వీడియో
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలా అప్పట్లో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ సడెన్‌గా కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి మధ్య ఏదో లవ్ రిలేషన్ నడుస్తున్నట్లు పలు పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. కాగా త్రిష ఇప్పటి వరకు ఎలాంటి ఐటెమ్ సాంగ్‌లలో నటించలేదు. కానీ, విజయ్ నటించిన ‘గోట్’ చిత్రంలో మాత్రం స్పెషల్ సాంగ్‌లో ఫస్ట్ టైం నటించింది.
దీంతో ఒక్కసారిగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష, విజయ్ కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే రీసెంట్‌గా హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంటికి చిక్కినట్లు సమాచారం. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ దీన్ని చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోపై త్రిష కానీ విజయ్ కానీ ఎలా స్పందిస్తారో, అసలు స్పందిస్తారో లేదో చూడాలి.