Trisha: ‘మౌనం.. ఆవేశం.. నమ్మకం’.. ఇంట్రెస్టింగ్‌గా హీరోయిన్ పోస్ట్

40+ ఏజ్‌లో కూడా వన్నెతరగని అందంతో కుర్రహీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది త్రిష (Trisha).

Update: 2024-12-21 14:10 GMT

దిశ, సినిమా: 40+ ఏజ్‌లో కూడా వన్నెతరగని అందంతో కుర్రహీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది త్రిష (Trisha). ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings) స్టార్ట్ చేసి బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ.. త్వరలో ‘విదాముయార్చి’ (Vidhamuyarchi) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ (Leica Productions) బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో అర్జున్ సర్జా (Arjun Sarja), రెజీనా కాసాండ్రా (Regina Cassandra), ఆరవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.. అప్పుడే ప్రమోషన్స్ (Promotions) కూడా స్టార్ట్ చేసేశారు. ఇందులో భాగంగా.. తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ (Final Schedule) షూట్ చేస్తున్నట్లు తెలుపుతూ త్రిష కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ‘మౌనం.. ఆవేశం.. నమ్మకం..’ అనే క్యాప్షన్ (caption) ఇచ్చి మరిన్ని బ్యూటీఫుల్ పిక్స్ (Beautiful Pics) ప్రేక్షకులతో పంచుకుంది ఈ బ్యూటీ. వైట్ కలర్ శారీలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్న ఈ అమ్మడు అందానికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఈ పొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News