ప్రియుడిలో గోవా ట్రిప్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్.. రూమ్‌లో అలాంటి పని?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది.

Update: 2024-12-24 06:22 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. ఇటీవల ‘స్త్రీ-2’(Stree 2) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. అయితే ఇటీవల ఆమె విజయ్ వర్మ(Vijay Verma)తో ప్రేమలో ఉన్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి అందరికీ షాకిచ్చింది.

ఇక అప్పటి నుంచి పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కానీ పెళ్లి ఎప్పుడో చెప్పడం లేదు. తాజాగా, ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్‌ విజయ్ వర్మతో కలిసి గోవా(Goa) వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్, ప్రియుడితో కలిసి రూమ్‌లో గేమ్ ఆడుతూ షాక్ అవుతున్నట్లు, బెడ్ రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పడుకున్నట్లు, కాఫీ కప్ పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ చేస్తూ ‘గోవా గేట్‌వే’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ ఫొటోల(Photos)ను చూసిన నెటిజన్లు చాలా బాగున్నావ్ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News