Sankranti Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ రిలీజ్‌కి టైమ్ ఫిక్స్.. పోస్ట్ వైరల్
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.
దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లలో భాగంగా వరస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన డేట్ అండ్ టైమ్‌ను అనౌన్స్ చేస్తూ మూటీ టీమ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ‘2.22 నిమిషాల నిడివితో ఉండే ఫైర్ అండ్ ఫన్‌తో కూడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈ రోజు మీ ముందుకు వస్తుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్‌లోని కలెక్టర్ గ్రౌండ్‌లో ఈ రోజు సాయంత్రం 5గంటలకు జరగనున్న సంగతి తెలిసిందే.