ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది.. శాశ్వతంగా నిలిపోతుందంటూ యంగ్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

కోలీవుడ్ బ్యూటీ దుషారా విజయన్(Dushara Vijayan), చియాన్ విక్రమ్(Chiyan Vikram) నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూర-2’(Veera Dheera Soora).

Update: 2025-03-29 12:16 GMT
ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది.. శాశ్వతంగా నిలిపోతుందంటూ యంగ్ బ్యూటీ ఎమోషనల్  పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ దుషారా విజయన్(Dushara Vijayan), చియాన్ విక్రమ్(Chiyan Vikram) నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూర-2’(Veera Dheera Soora). అరుణ్ కుమార్(Arun Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌ను హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శింబు(Riya Simbu) నిర్మించారు. ఇందులో ఎస్‌జే సూర్య(SJ Surya), సూరజ్, వెంజరమూడు, పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా పలు వాయిదాల మధ్య మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, దుషారా విజయన్ టీమ్ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘వీర ధీర శూర-2 పట్ల ఉన్న అపారమైన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.

మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కళైవాణి ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. ఇది నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మేధావి అరుణ్ కుమార్ సార్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంతే కాకుండా చియాన్ విక్రమ్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసిన కాళి? ఖచ్చితంగా మీరు అనుకున్నంత సీరియస్ కాదు. సెట్‌లో మీ శక్తి, అంకితభావం, పరిపూర్ణ ప్రకాశం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇంత అద్భుతమైన ప్రతిభతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. అలాంటి ఎనర్జిటిక్ ప్రొడ్యూసర్‌తో ఈ క్యూటీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కళైవాణిలోని ఉత్తమమైన వాటిని పెద్ద తెరపైకి తీసుకొచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

Tags:    

Similar News